చింతామణి : క్యాంటర్–టెంపో ఢీకొని టమాటా నేలపాలైన ఘటన కోలారు జిల్లా కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని కనిశెట్టిహళ్లి వద్ద బుధవారం జరిగింది. తంబళ్లపల్లి తాలూకా కందుకూరు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే రైతు టమాటాలను అమ్ముకోవడానికి చింతామణి మార్కెట్‌కు సొంత క్యాంటర్‌లో తీసుకొస్తుండగా చింతామణి నుంచి చేలూరుకు వెళ్తున్న టెంపో ఎదురైంది. వాహనాలు పరస్పరం ఢీకొనడంతో క్యాంటర్ రోడ్డు పక్కన బోల్తా పడి టమాటా నేలపాలైంది. ప్రమాదం నుంచి డ్రైవర్ లక్ష్మీనారాయణ సురక్షితంగా బయటపడ్డాడు. టెంపో డ్రైవర్ షారుకు కాలు విరిగింది. చుట్టుపక్కల వారు క్షతగాత్రుడిని చింతామణి ఆస్పత్రికి తరలించారు. కంచార్లపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


