వినాయక నిమజ్జనంలో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

నీట మునిగి వ్యక్తి మృతి

తంబళ్లపల్లె : మండలంలో బుధవారం వినాయక విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మండలంలోని కొటాల ఏటిగడ్డన ఏర్పాటు చేసిన బొజ్జగణపయ్యను ఉదయం నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఏటిగడ్డకు సమీపంలో ఉన్న పెద్దేరు వాగులో నిమజ్జనం చేస్తుండగా రెడ్డప్ప (40) ప్రమాదవశాత్తు నీటి మునిగి మృతి చెందాడు. స్థానికులు వెంటనే బయటకు తీసి తంబళ్లపల్లె సీహెచ్‌సికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్థారించారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ ఆస్పత్రికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీశారు.

మహిళ ఆత్మహత్య

వీరబల్లి : మండలం పరిధిలో గడికోట ప్రాంతంలో కృష్ణమయ్య గారి పల్లి కు చెందిన శ్రావణి (23) అనే మహిళ పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రావణికి నాలుగేళ్ల క్రితం రాయచోటి మండలం సిబ్యాల పంచాయతీలోని నారవపల్లెకు చెందిన విజయ్‌తో వివాహం జరిగింది. అయితే మంగళవారం గడిగోట ప్రాంతం కృష్ణయ్య గారిపల్లెకు వచ్చి అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

మైదుకూరు : మైదుకూరు మండలం తువ్వపల్లె కూడలి వద్ద బైక్‌పై నుంచి కిందపడి బుధవారం రాత్రి సంబటూరు జానయ్య (50) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జాండ్లవరం వీఆర్‌ఓ కాలనీకి చెందిన జానయ్య బైక్‌పై జీవీ సత్రంకు వస్తుండగా కూడలి వద్ద అదుపు తప్పి బైక్‌పై నుంచి కింద పడ్డాడు. నుదురు, మొహంపై రక్తగాయాలయ్యాయి. బళ్లారి – కృష్ణపట్నం హైవే అంబులెన్స్‌లో అతన్ని చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సలహాతో జానయ్యను కుటుంబ సభ్యులకు కడపకు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement