మదనపల్లె సిటీ : సచివాలయాల్లో ప్రత్యేక బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు పెరిగిన ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు రైతుబజార్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు ప్రజలకు అందజేయాలని సూచించారు. చక్కర అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, ఊహాజనిత కార్యకలాపాలను అరిట్టేందుకు భౌతికంగా ఽధ్రువీకరించాలన్నారు. రెవెన్యూ, సివిల్ సప్లయిస్, లీగల్ మెట్రాలజీశాఖలకు చెందిన ఎన్‌ఫోర్సుమెంట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ


