మదనపల్లె సిటీ: పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసి) ఎన్నికలు సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని సమగ్రశిక్ష అనదపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ అనూరాధ తెలిపారు. మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 29న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని 1,785 ప్రభుత్వ , యాజమాన్య పాఠశాలలు, 7 ఎయిడెడ్ పాఠశాలల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. అలా గే 473 ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈనెల 15న ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎస్‌ఎంసీ సభ్యు లు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. 18న పాఠశాల నోటీసుబోర్డులపై ఓటర్ల జాబితా ప్రచురణ, 25వతేదీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, తుది జాబితా ఖరారు జరుగుతుందన్నా రు. 29న ఎన్నికలు ఉదయం 7 నుంచి 1 గంట వరకు జరుగుతాయన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. 3 గంటలకు నూతన కమిటీ సమావేశం జరుగుతుందన్నారు.
రొంపిచెర్ల: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నట్లు చిత్తూరు జిల్లా డీవైఈవో ఇందిర తెలిపారు. ఆమె మంగళవారంవిలేకరులతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటుకు మంగళవారం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.
సమగ్ర శిక్షణ ఏపీసీ
డాక్టర్ అనూరాధ


