● పునాది రాళ్లు.. | - | Sakshi
Sakshi News home page

● పునాది రాళ్లు..

Sep 4 2026 1:24 AM | Updated on Sep 4 2026 1:24 AM

● రప్పించి.. అవమానించి..

ప్రవీణ్‌ది మూడున్నరేళ్ల ప్రయాణమే

తంబళ్లపల్లె టీడీపీ అంటేనే హడల్‌

ఉమాశంకర్‌, లక్ష్మీదేవమ్మల బాటలోనే ప్రవీణ్‌, జయచంద్ర బలి

వాడుకుని వదిలేయడం బాబు నైజం

ప్రత్యామ్నాయం లేక మళ్లీ శంకర్‌కే

పగ్గాలప్పగించిన వైనం

సాక్షి, మదనపల్లె: తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలకు, గెలిచిన ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్తు ఉండదా? ఇక్కడి రాజకీయాలు ఆ పార్టీ నేతలకు అచ్చిరావా? లేక టీడీపీకి తంబళ్లపల్లె నియోజకవర్గం ఒక శాపమా? అన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ తిరిగి టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను చేపట్టడంతో.. చంద్రబాబు చేతిలో ఆయన రాజకీయ భవిష్యత్తు భద్రమేనా? రాబోయే ఎన్నికల నాటికి మళ్లీ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్న చర్చ మొదలైంది. ఇక్కడి టీడీపీ నేతలకు తంబళ్లపల్లె అచ్చిరాదని, అది ఒక సెంటిమెంట్‌గా మారిందని చెప్పడానికి ఆ పార్టీ ఆవిర్భావం నుండి మొన్న ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో ఇరుక్కున్న మాజీ టీడీపీ ఇన్‌చార్జ్‌ జయచంద్రారెడ్డి వరకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడమంటే రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని తంబళ్లపల్లె రాజకీయ చరిత్రను ప్రత్యక్షంగా చూసిన విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

తొలి ఎన్నికలోనే పరాజయం..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1983లో టీడీపీ ప్రభంజనం సృష్టించినప్పటికీ తంబళ్లపల్లెలో మాత్రం అది సాధ్యంకాలేదు. అప్పట్లో టీఎన్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇ వ్వకపోవడంతో టీఎన్‌.శ్రీనువాసులురెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుండి ఆవుల మోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున ఉమాశంకర్‌రెడ్డి పోటీ చేయగా.. ఇండిపెండెంట్‌ అభ్యర్థి చేతిలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీకి తొలి ఎన్నికలోనే పరాజయం ఎదురైంది.

జయచంద్రారెడ్డి

శంకర్‌ యాదవ్‌

తల్లిదండ్రుల బాటలోనే రాజకేయంలోకి వచ్చిన ఏవీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సైతం ఐదేళ్లు ఆ పార్టీలో కొనసాగలేదు. 2009 ఎన్నికల్లో గెలిచినప్పటికీ చంద్రబాబు తెలంగాణ లేఖను వ్యతిరేకిస్తూ మూడున్నరేళ్లకే పార్టీని వీడి ప్రస్తుతం రాజకీయాలకే దూరమయ్యారు. నియోజకవర్గంలో పార్టీకి దిక్కులేక మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ను రప్పించుకున్న అధిష్ఠానం.. ఆయనను అడుగడుగునా అవమానిస్తూ నట్టేట ముంచింది.

2014 ఎన్నికల్లో గెలిచిన శంకర్‌కు 2019లో ఎవరూ పోటీలేకున్నా చివరిక్షణం వరకు అభ్యర్థితత్వం ప్రకటించకుండా చుక్కలు చూపించారు. ఆ ఎన్నికల్లో ఓటమికంటే చంద్రబాబు చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ లోకేష్‌ పాదయాత్ర, పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా ఆయన్ను కాదని జయచంద్రారెడ్డికి ఏకపక్షంగా టికెట్‌ ప్రకటించారు. దాంతో శంకర్‌ బెంగళూరుకే పరిమితమైపోయారు. మరోవైపు 2024 ఎన్నికలకు ముందు చేరి టికెట్‌ దక్కించుకున్న డి.జయచంద్రరెడ్డి ప్రస్థానం కూడా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసుతో ముగిసిపోయింది. ప్రధాన నిందితుడిగా కేసు నమోదు కావడంతో చంద్రబాబు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పట్టుమని రెండేళ్లయినా పార్టీలో కొనసాగలేకపోయిన జయచంద్రారెడ్డి కథ ముగిసిపోవడంతో, ప్రత్యామ్నాయం లేక తిరిగి శంకర్‌కే పార్టీ ఇన్‌చార్జ్‌ పదవి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement