● వెన్నుపోటుకు అండగా నిలిస్తే.. లక్ష్మీదేవమ్మకే వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

● వెన్నుపోటుకు అండగా నిలిస్తే.. లక్ష్మీదేవమ్మకే వెన్నుపోటు

Sep 4 2026 1:24 AM | Updated on Sep 4 2026 1:24 AM

● వెన్నుపోటుకు అండగా నిలిస్తే.. లక్ష్మీదేవమ్మకే వెన్నుపోటు

భర్త ఉమాశంకర్‌రెడ్డి హత్యతో లక్ష్మీదేవమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 1989 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి కడప ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడమే టీడీపీలో ఆమెకు చివరి ఎన్నికై ంది. 1995 ఆగస్టులో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయిన సమయంలో లక్ష్మీదేవమ్మ ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబుకు అండగా నిలిచారు. ఆ తర్వాత చంద్రబాబు ఆమె రాజకీయ భవిష్యత్తును పూర్తిగా కాలరాశారు. తనకు అండగా నిలిచిన లక్ష్మీదేవమ్మ పోటీ చేయాల్సిన తంబళ్లపల్లె సీటును 1999, 2004 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించి ఆమెకు ద్రోహం చేశారు. తన రాజకీయ ఉనికి కోసం 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోవడంతో లక్ష్మీదేవమ్మ రాజకీయ ప్రస్థానానికి శాశ్వతంగా తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement