● మూలస్తంభం ఉమాశంకర్‌రెడ్డి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

● మూలస్తంభం ఉమాశంకర్‌రెడ్డి దారుణ హత్య

Sep 4 2026 1:24 AM | Updated on Sep 4 2026 1:24 AM

● మూలస్తంభం ఉమాశంకర్‌రెడ్డి దారుణ హత్య

1983లో టీడీపీ ఆవిర్భావం అయ్యాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి పునాదులు వేసింది ఏవీ.ఉమాశంకర్‌రెడ్డి. గూడుపల్లెకు చెందిన ఉన్నత విద్యావంతుడైన ఆయన.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, పార్టీకి తొలి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో నియోజకవర్గంలో నక్సల్స్‌ అనుకూల, వ్యతిరేక సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఒక సంఘానికి మద్దతుగా నిలిచిన ఉమాశంకర్‌రెడ్డి.. 1984 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నగారిపల్లె వద్ద తంబళ్లపల్లె నుంచి ములకలచెరువుకు వస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన ఉమాశంకర్‌రెడ్డి రాజకీయ జీవితం టీడీపీలోకి వచ్చిన రెండేళ్లకే ఘోరంగా ముగిసిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement