వైఎస్సార్‌సీపీతోనే క్రిస్టియన్ల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే క్రిస్టియన్ల అభివృద్ధి

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

సాక్షి, మదనపల్లె: రాష్ట్రంలో క్రిస్టియన్‌ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ క్రిస్టియన్‌ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌ వెస్లీ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌తో కలిసి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మైనారిటీ వర్గాల సంక్షేమం, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, సామాజిక భద్రత తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా జాన్‌ వెస్లీ మాట్లాడుతూ.. క్రిస్టియన్‌ మైనారిటీల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మైనారిటీల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చారని కొనియాడారు. ఆయన చూపిన సంక్షేమ బాట, సామాజిక న్యాయం, మానవతా విలువలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. పేద క్రైస్తవ కుటుంబాల విద్యార్థులు, యువతకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. పార్టీ సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. క్రైస్తవులు విద్యా, వైద్య రంగాలలో ఎనలేని సేవలు అందిస్తున్నారని, సమాజంలో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. జిల్లాలో క్రిస్టియన్‌ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కోరారు. జిల్లా క్రిస్టియన్‌ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు పాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, క్రిస్టియన్ల సమస్యలను పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. జిల్లా కార్యదర్శి రాజేష్‌ మాట్లాడుతూ.. క్రిస్టియన్‌ మైనారిటీల సంక్షేమం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ జింకా చలపతి, పార్టీ నాయకులు వీఎస్‌.రెడ్డి, ఎల్‌.రఘునాథ రెడ్డి, ఎస్‌.కె.ఇర్ఫాన్‌, షానవాజ్‌, ఆవుల మల్లికార్జునలతో పాటు క్రిస్టియన్‌ మైనారిటీ నాయకులు మయూర్‌, మేరీ, రిచర్డ్స్‌, విజయ్‌, అజయ్‌, నాగమణి, అమ్మాజాన్‌, శ్రీనివాసులు, ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కార్యవర్గ సమావేశంలో

రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌ వెస్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement