ఓటర్లకు మరో అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఓటర్లకు మరో అవకాశం

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు

10 వరకు గడువు పెంపు

మదనపల్లె (కురబలకోట): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు గడువును సెప్టెంబరు 10 వరకు పొడిగించినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని ఆయన సూచించారు.అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులున్నా.. వెంటనే సంబంధిత ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ లేదా బీఎల్‌ఓలను సంప్రదించి నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబరు 5 వరకు సమయం ఉంటుందని, అనంతరం అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement