మెరుగైన ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

మెరుగైన ఉపాధి అవకాశాలు

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

సదుం: వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లొమా చేసిన విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉంటాయని ప్రిన్సిపల్‌ ఇందుమతి తెలిపారు. స్థానిక ఎస్వీ ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీలో ప్రస్తుత బ్యాచ్‌ విద్యార్థుల వీడ్కోలు, నూతన విద్యార్థల స్వాగత కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. డిప్లొమా చేసిన విద్యార్థులు ఇరవై ఏళ్ల వయస్సుకే ఉపాధి పొందవచ్చని ఆమె చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్‌ వెటర్నరీ సర్జన్‌ అరుణ్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత కోసం ప్రవేశ పెట్టిన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం క్రీడలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. సూపరింటెండెంట్‌ మునికృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రాజంపేట: నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్‌ ఎస్‌.అబ్ధుల్‌ రహిమాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల(అన్నమయ్య, వైఎస్సార్‌ కడప)కు 2026–27 విద్యసంవత్సరంలో 8 వతరగతి 11వ తరగతి చదువుతున్న విద్యార్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశపరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులను పంపుటకు ఈ నెల 30వ తేదీని గడువుగా నిర్ణయించామన్నారు.

క్రీడాభారతి పరీక్షకు

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

మదనపల్లె సిటీ: క్రీడాభారతి అనే కేంద్ర సంస్థ క్రీడా జ్ఞాన పరీక్షను నిర్వహిస్తున్ననట్లు జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్‌బాబు తెలిపారు. ఈ పరీక్షను ప్రభుత్వ, ప్రైవేటు, కాలేజీ విద్యార్థులు రూ.20లతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ను సెప్టెంబర్‌ 4వతేదీలోగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ నెల 6వతేదీ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, లాప్‌టాప్‌, టాబ్‌లలో ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయవచ్చునన్నారు. దక్షిణ మధ్య కేంద్రంలో మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.లక్ష, ద్వితీయ స్థానం పొందిన ఇద్దరికి రూ.50 వేలు, మూడవ స్థానం 5 మందికి రూ.25 వేలు, నాల్గవ స్థానం సాధించిన 11 మందికి రూ.11 వేలు అందజేస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9885055402ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement