గుర్రంకొండ: ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టులపై బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్‌ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కె. శామ్యూల్ పేర్కొన్నారు. శనివారం స్థానిక తెలుగు జెడ్పీహైస్కూల్లో గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలకు చెందిన ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టుల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతినెలా నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు క్రమం తప్పకుండా హజరుకావాలన్నారు. ఇక్కడ శిక్షణ ఇచ్చే సీసీలు చెప్పే విషయాలను ఆలకించి వాటిని ఆచరించాలన్నారు.దీనివల్ల ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టుల మీద పట్టుసాధించ వచ్చన్నారు.కార్యక్రమంలో ఎంఈవో సురేంద్రబాబు పాల్గొన్నారు.


