రోజుల తరబడి తిరుగుతున్నా | - | Sakshi
Sakshi News home page

రోజుల తరబడి తిరుగుతున్నా

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

రోజుల తరబడి తిరుగుతున్నా విసిగిపోతున్న వినియోగదారులు

ఇటీవల మోటార్‌ సైకిల్‌ కొన్నా. దానికి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌కు రోజుల తరబడి తిరుగుతున్నా కావడం లేదు. సర్వర్‌ సమస్య వస్తోంది. దీని కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం విచారకరం. వ్యయప్రయాసలకు గురి కావడంతో పాటు సమయం వృధా అవుతోంది. ఫైనాన్స్‌ సంస్థల్లో రుణం తీసుకున్నప్పుడు సర్వర్‌ పనిచేస్తుంది. రుణం తీర్చాక ఎందుకు పనిచేయదో అర్థం కావడం లేదు.

– నూర్‌ మహమ్మద్‌, వాహనదారుడు, మదనపల్లి

ఫైనాన్స్‌ సంస్థలకు రుణం చెల్లించి కూడా క్లియరెన్స్‌ కోసం తిరగాల్సి రావడం విడ్డూరంగా ఉంది. సర్వర్‌ మొరాయింపు వాహనదారులకు విసుగుతెప్పిస్తోంది. అత్యవసరంగా వాహనాలు అమ్మాల్సిన వారు, ఆర్సీలో ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ చేసుకోవాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులకుపైగా సర్వర్‌ సమస్య ఉన్నా అధికారులు ఏం చేస్తున్నట్లో. – చిటికి శివరామిరెడ్డి,

వెహికల్స్‌ సెల్స్‌ రెప్రజెంటేటివ్‌, మదనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement