ప్రకృతి ఒడిలో లెగసీ సందడి! | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో లెగసీ సందడి!

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని వెంకటమ్మ చెరువు పరిసర ప్రాంతాలలో శనివారం ‘లెగసీ’ సినిమా షూటింగ్‌ సందడి అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. ఇక్కడి ఎత్తయిన కొండలు, పచ్చని పంట పొలాలు, చెరువు అందాల నడుమ హీరో విశ్వక్‌సేన్‌, హీరోయిన్‌ ఏక్తా రాథోడ్‌లపై దర్శకుడు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. టాలీవుడ్‌ మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ తమ ప్రాంతానికి వచ్చాడన్న సమాచారంతో, షూటింగ్‌ను కళ్లారా తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాదిగా అభిమానులు, జనం లొకేషన్‌కు తరలివచ్చారు. చిత్రబృందమంతా బెంగళూరు రోడ్డులోని తాల్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లో బస చేయగా, ఈ నెల 20వ తేదీ వరకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రీకరణ నిరంతరాయంగా కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement