పీలేరు రూరల్ : పోక్సో కేసులో అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు ఎర్రయ్యను కోర్టుకు తరలించగా న్యాయమూర్తి.. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు పీలేరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. మండలంలోని చెన్నప్పగారిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎర్రయ్య.. ఇద్దరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతనిని కోర్టులో శనివారం హాజరు పరిచారు. సమావేశంలో ఎస్‌ఐలు లోకేష్, రమణ, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రాథమిక పాఠశాలలో చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను ఉపాధ్యాయుడు ఎర్రయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్లు పీలేరు ఎంఈఓ బాబు నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు.


