తంబళ్లపల్లి : పలు చోట ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన దొంగను శనివారం తంబళ్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దస్తగిరి, ఎస్‌ఐ అనిల్‌కుమార్ కథనం మేరకు..
తంబళ్లపల్లి మండలం దాదంవడ్డిపల్లెకు చెందిన డి.రాజ్ కుమార్(25) తంబళ్లపల్లి, ముదివేడు, మదనపల్లి ప్రాంతాల్లో పలు ద్విచక్రవాహనాలు చోరీ చేశాడన్నారు. శనివారం తంబళ్లపల్లి మండలం కన్నెమడుగు గ్రామ మఠం క్రాస్ వద్ద నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఆరు టీవీఎస్ ఎక్స్‌ఎల్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


