సర్‌ను గడువులోగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ను గడువులోగా పూర్తి చేయాలి

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

రాయచోటి (చిన్నమండెం) : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్‌)ను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. చిన్నమండెం మండలంలోని ఉర్దూ పాఠశాల పోలింగ్‌ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హతలు కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించకుండా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. చిన్నమండెం తహసీల్దార్‌ రామాంజనేయులు, ఎన్నికల శాఖ అధికారులు, ఎంపీడీఓ శ్రీధర్‌రెడ్డి, బూత్‌ లెవెల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రతను జీవితంలో భాగం చేసుకోవాలి

పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. చిన్నమండెంలోని ప్రాథమిక పాఠశాల(ఉర్దూ)ను శనివారం కలెక్టర్‌ సందర్శించి పాఠశాల పరిసరాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మండల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement