గడ్డి కొరత ఉన్నట్లు మాదృష్టికి రాలేదు | - | Sakshi
Sakshi News home page

గడ్డి కొరత ఉన్నట్లు మాదృష్టికి రాలేదు

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

గడ్డి కొరత ఉన్నట్లు మాదృష్టికి రాలేదు ప్రభుత్వానికి నివేదికలు పంపాం

‘అన్నమయ్య జిల్లాలో గడ్డి కొరత ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. ఇలాంటి సమయంలో రైతులు కాస్త తక్కువ గడ్డి (రోజుకు ఐదు కిలోలు మాత్రమే) ఇవ్వాలి. దీనికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదు. నీటి ఆధారం ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలు ఇస్తున్నాము. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువులు, కుంటలు, నీటిగట్టు ఖాళీ జాగాలలో ఉచితంగా గడ్డి విత్తనాలు సరఫరా చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా కూడా పచ్చి గడ్డి సమకూరుతోంది.’

– గుణశేఖర్‌ పిళ్లై, అన్నమయ్య జిల్లా అధికారి.

తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పాడి ఆవులు 62,315, గేదెలు 862, గొర్రెలు 3.60 లక్షలు, మేకలు 66,540 ఉన్నాయి. వీటికి రోజుకు 850 టన్నుల గడ్డి అవసరం ఉంటుంది. గడ్డి కొర త నివారించడానికి సబ్సిడీ ద్వారా విత్తనాలు, దాణా పంపిణీ చేస్తున్నాం. వీబీజీ రాంజీ పథకం నిధులతో గడ్డి సాగును ప్రోత్సహిస్తున్నాం. గడ్డి కొరత ఎదురైతే సబ్సిడీతో సీలేజ్‌ గడ్డి, సమీకృత దాణా పంపిణీ చేసేందుకు వీలుగా ప్రభుత్వానికి నివేదికలు పంపాం. – విక్రంరెడ్డి,

పశువైద్యాధికారి, పెద్దతిప్పసమద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement