మదనపల్లె సిటీ : విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అభ్యాసంతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరు రోడ్డులోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో నూతనంగా ప్రవేశం పొందిన బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కాలేజీలో లభించే విద్య, సాంకేతిక, ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ విద్య కేవలం డిగ్రీ సాధించడానికి మాత్రమే కాకుండా జ్ఞానం, నైపుణ్యాలు, సృజనాత్మకత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే గొప్ప అవకాశమన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాలు, ఉన్నత విద్య ,కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ రామమోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్ నాగమల్లారెడ్డి, ప్రిన్సిపాల్ రాయుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.


