అన్నమయ్య ఉడాతో పాలనా సౌలభ్యం | - | Sakshi
Sakshi News home page

అన్నమయ్య ఉడాతో పాలనా సౌలభ్యం

Aug 19 2026 1:53 AM | Updated on Aug 19 2026 1:53 AM

సాక్షి, మదనపల్లె : అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీల పునర్‌ వ్యవస్థీకరణతో పాలన సౌలభ్యం కలుగుతుందని పీకేఎం ఉడా వైస్‌ చైర్మన్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ పట్టణాభివృద్ధికి అనుగుణంగా, జిల్లా పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన అన్నమయ్య ఉడా నూతన పరిపాలనా వ్యవస్థకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన జరుగుతుందని వివరించారు.

ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల గడువు పెంపు

మదనపల్లె సిటీ : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు స్వీకరించే గడువు ఈనెల 20వతేదీ వరకు పొడగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థల మేరకు గడువు పెంచినట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు 20వతేదీ సాయంత్రం 5గంటల లోపు డీఈఓ కార్యాలయం, మదనపల్లెలో అందజేయాలని సూచించారు.

ఓటు హక్కు కోసంనమోదు చేసుకోండి

సాక్షి మదనపల్లె : ఓటు హక్కు కోసం 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2008 జూన్‌ 30కి ముందు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. వీరితోపాటు ఇంతవరకు ఓటు హక్కు లేని వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. వీరికి ఓటు హక్కు కల్పిస్తూ అక్టోబర్‌ మూడవ తేదీన ప్రచురించే సర్‌ జాబితాలో ప్రకటిస్తారని వివరించారు. అలాగే ఓటర్ల పేరులో మార్పులు, సవరణలకు ఫారం–8, విదేశాల్లో ఉన్నవారు ఫారం–6ఏ, ఓటు నమోదుకు ఫారం–6 వినియోగించుకోవాలని కోరారు. సర్‌ జాబితా ప్రకటన తర్వాత కొత్త ఓటర్ల నమోదు జరగదని స్పష్టం చేశారు.

క్రీడా ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

మదనపల్లె సిటీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందజేసే స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాలల క్రీడా ఫలితాల ఆధారంగా జిల్లాలో ఉత్తమంగా నిలిచిన ఐదు పాఠశాలలకు క్రీడా ప్రతిభా అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 20వతేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 21న పరిశీలన, 22న అభ్యంతరాల స్వీకరణ, 24న తుది జాబితా ప్రకటన ఉంటుందని తెలిపారు. ఎంపికై న ఐదు పాఠశాలలకు 29న అవార్డులు అందజేస్తామన్నారు. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ బ్లాగులో పొందుపరిచినట్లు వివరించారు.

కదం తొక్కిన కార్మికులు

కడప సెవెన్‌రోడ్స్‌ : తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర పిలుపులో భాగంగా మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. తొలుత మహావీర్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీగా వచ్చా రు. అప్పటికే ప్రధాన ద్వారాలను పోలీసులు మూసివేశారు. దీంతో ఆందోళనకారులు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.వేణుగోపాల్‌, కేసీ బాదుల్లా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం కాకుండా అంబానీ, ఆదాని లాభాల కోసమే పనిచేస్తున్నాయంటూ విమర్శించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్‌చేశా రు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. ఇటీవల 8 గంటల పని ని 10 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయ డాన్ని ఖండించారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగా సురేష్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ మద్దిలేటి, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీరాము లు, ఉపాధ్యక్షులు లింగన్న, చాన్‌బాష, కార్య దర్శులు వెంకట రమణ, కల్పన, నగర అధ్యక్షులు కల్పన యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement