కరువును ఎదుర్కొనేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

కరువును ఎదుర్కొనేలా చర్యలు

Aug 19 2026 1:53 AM | Updated on Aug 19 2026 1:53 AM

సాక్షి, మదనపల్లె : జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఎదుర్కునేలా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలు, గ్రామీణ నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాధారణ సాగు ఇవ్వడంతో కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద 1,781 మంది రైతులు, ఇతర బీమా పథకాల కింద 19,021 మంది రైతులు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బీమా నమోదు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కరువు పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement