అభివృద్ధి ప్రణాళికలో జిల్లా కీలకం కావాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ప్రణాళికలో జిల్లా కీలకం కావాలి

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

సాక్షి, మదనపల్లె: తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో అన్నమయ్య జిల్లా కీలకం అయ్యేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని పరిశ్రమలు, వాణిజ్యం (గనులు) శాఖ ముఖ్య కార్యదర్శి, తిరుపతి ఎకనామిక్‌ రీజన్‌ సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర–2047 విజన్‌ అమలులో భాగంగా రాష్ట్రాన్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే మూడు ఆర్థిక ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించిందని తెలిపారు. తిరుపతి ఆర్థిక ప్రాంతంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని, అందులో అన్నమయ్య జిల్లా ఒకటన్నారు. 2047 నాటికి ఈ ప్రాంతాన్ని 0.9 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. భౌగోళికంగా జిల్లా బెంగళూరు, తిరుపతి నగరాలకు సమీపంలో అభివృద్ధి అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత విలువవృద్ధి, పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్‌, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగం, విద్యా–నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి, వాటిని దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన నీటి లభ్యత, విద్యుత్‌ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ మాట్లాడుతూ విజన్‌కు అనుగుణంగా జిల్లాను అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని వివరించారు. శాఖల ద్వారా నియోజకవర్గాల వారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, జిల్లాలో ఉన్న వనరులు, పెట్టుబడి అవకాశాలు, సామర్థ్యంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

అక్రమ మద్యం నిర్మూలనకు చర్యలు చేపట్టండి

మదనపల్లె టౌన్‌: జిల్లాలో అక్రమ మద్యం నిర్మూలన, బహిరంగ మద్యపాన నియంత్రణ, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎకై ్సజ్‌), పరిశ్రమలు, వాణిజ్యం గనులశాఖ టిఈఆర్‌ విభాగం సీఈఓ ముఖేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లె జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఎకై ్సజ్‌ శాఖ,మైనింగ్‌ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐడీ లిక్కర్‌ కు సంబంధించిన నేరాలను గణనీయంగా తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement