శ్రీరెడ్డెమ్మతల్లికి వెండి వస్తువులు బహూకరణ | - | Sakshi
Sakshi News home page

శ్రీరెడ్డెమ్మతల్లికి వెండి వస్తువులు బహూకరణ

Aug 1 2026 1:43 AM | Updated on Aug 1 2026 1:43 AM

గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయానికి రాయచోటికి చెందిన చింతం అభీషేక్‌, తేజస్విని దంపతులు వెండివస్తువులను బహూకరించారు. శుక్రవారం దాతలకు ఆలయ సంప్రదాయల ప్రకారం అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో వారిని సన్మానించారు. దాతలు ఒక కేజి బరువు గల వెండిజ్వాలా కిరీటం, శఠారీ, ప్రసాదం గిన్నె, కర్ణకవచాలను ఈవో మంజులకు అందజేశారు. అమ్మవారి సేవలకు వీటిని వినియోగించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యం

పీలేరు : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యమని ఏపీ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ అన్నారు. శుక్రవారం పీలేరు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం తోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు చేపడుతున్న ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్‌ బిల్లులు డిజిటల్‌ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించి వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఈఈ వై. చంద్రశేఖర్‌రెడ్డి, అధికారులు శ్రీనివాసులురెడ్డి, అమీర్‌బాషా, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement