●కళ్లముందు సాక్షాత్కరించిన సాగునీటి ప్రాజెక్టులు | - | Sakshi
Sakshi News home page

●కళ్లముందు సాక్షాత్కరించిన సాగునీటి ప్రాజెక్టులు

Jul 8 2026 2:14 AM | Updated on Jul 8 2026 2:14 AM

●కళ్లముందు సాక్షాత్కరించిన సాగునీటి ప్రాజెక్టులు

వైఎస్సార్‌ మయాంలో తొలి జలయజ్ఞం ప్రాజెక్టు వెలిగల్లు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో శరవేగంగా పూర్తి చేసుకున్న వెలిగల్లు ప్రాజెక్టును తొలి జలయజ్ఞం ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి హోదాలో 2008 డిసెంబరు 24వ తేదీన జాతికి అంకితం చేశారు. 4.64 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పుంగనూరు నియోజకవర్గంలోని ఈడిగపల్లె వద్ద రూ. 350 కోట్లతో, సోమల మండలం ఆవులపల్లె వద్ద రూ. 400 కోట్లతో సాగు, తాగునీటి అవసరాలమేరకు ప్రాజెక్టులను నిర్మించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement