అదుపుతప్పి ఆలయాన్ని ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి ఆలయాన్ని ఢీకొన్న కారు

Mar 13 2026 7:53 AM | Updated on Mar 13 2026 7:53 AM

చౌడేపల్లె : చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని పెద్దకొండామర్రి సమీపంలో గువ్వకుంట మలుపువద్ద గల ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ కారు అదుపు తప్పి ఢీకొన్న ఘటన గురువారం జరిగింది.ఈ కారు చారాలనుంచి మదనపల్లె వైపు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా గాయపడిన వారి వివరాలు తెలియరాలేదు.

15 నుంచి అన్నమయ్య

వర్ధంతి ఉత్సవాలు

రాజంపేట : తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి ఉత్సవాలను ఈనెల 15 నుంచి నిర్వహించనున్నట్లు అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 15న తాళ్లపాకలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 21వ తేది వరకు జరుగుతాయి. ప్రతి రోజు కళాకారులచే సంగీతసభలు, హరికథలు నిర్వహించనున్నారు.

11మందిపై కేసు నమోదు

కాశినాయన : మండలంలోని ఇటుకలపాడు గ్రామానికి చెందిన గంజికుంట సుబ్బరాజేశ్వరరావు ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు. ఇటుకలపాడు గ్రామానికి చెందిన రాజేశ్వరరావు తన పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా మైదుకూరు మండలానికి చెందిన ఆకుల ఓబులేసు, ఎంబడి పోలయ్య, ఇటుకలపాడు గ్రామానికి చెందిన కె.ఆదినారాయణరెడ్డి, కె.రమణారెడ్డి, ఎక్కంటి బాలయ్య, కాటే చిన్నకొండయ్య, వల్లం పిచ్చయ్య, సీతగాని మల్లయ్య, వల్లం పీరయ్యలు దాడికి యత్నించారు. ఈ భూమి మాదని, ఈ పొలంలోకి ట్రాక్టర్‌తో దున్నడానికి వస్తే చంపుతామని బెదిరించారని రాజేశ్వరరావు ఫిర్యాదు చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement