పీలేరురూరల్ : మా ఇళ్లను అక్రమంగా తొలగిస్తున్నారు... న్యాయం చేయాలని బాధితులు కోరారు. మండలంలోని గూడరేవుపల్లె కురవపల్లెకు చెందిన బాధితులు గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడరేవుపల్లె సర్వే నెంబరు 611/3లో తాము 70 సంవత్సరాలుగా కాపురం ఉంటున్నామని తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన ఎ. పుల్లయ్య కుమారుడు హితేష్, ఎ. సరస్వతమ్మ, చిన్న, నాగరత్నమ్మ, చంద్రయ్య, సరిత అనువారు దౌర్జన్యంగా ఇది మా జాగా అంటూ ఇళ్లను వదిలేసి వెళ్లాల్సింది బెధిరించారని తెలిపారు. కొన్ని పాత ఇళ్లను ధ్వంసం చేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు వాణి, వనమ్మ, మల్లేశ్వరి, శాంతకుమారి, రెడ్డెమ్మ, లక్ష్మీదేవి, రెడ్డిరాణి తదితరులు పాల్గొన్నారు.


