తండ్రి కోసం.. కుమారుడి మృతదేహం ఎదురుచూపు
కురబలకోట : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదివారం మృతి చెందిన కుమారుడి మృతదేహం సౌదీలోని తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న విషాదకర సంఘటన కురబలకోటలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు..మండల కేంద్రం కురబలకోటకు చెందిన కె. తన్వీర్ (24) మూడు రోజుల క్రితం మదనపల్లి నుండి బైక్‌లో స్వగ్రామానికి వస్తూ మార్గ మధ్యంలోని గౌనివారిపల్లి వద్ద ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. జీవనోపాధి కోసం సౌదీలో ఉన్న తండ్రి కె. రెడ్డిబాషా రాక కోసం మృత దేహాన్ని ఇంటి వద్ద ఉంచారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కన్నీరు మున్నీరవుతున్నారు.
మా కుమార్తె ఆచూకీ తెలపండి
ప్రొద్దుటూరు కల్చరల్ : వారం రోజులుగా కనిపించకుండా పోయిన తమ కుమార్తె ఆచూకీ తెలపాలని సీతం పల్లెకు చెందిన కొల్లుబోయిన వీరప్రతాప్, వెంకటలక్షుమ్మ దంపతులు కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ కుమార్తె ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత కనిపించకపోవడంతో అంతా వెతికామన్నారు. తర్వాత రోజు ఉదయం చాపాడు మండలం రామదాసుపల్లెకు చెందిన రాకేష్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలువగా మహిళా పోలీస్ స్టేషన్‌కు రెఫర్ చేశారన్నారు. వారం రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ కుమార్తె బతికుందో లేదో తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికై నా పోలీసులు తమ కుమార్తె ఆచూకీ కనుగొనాలని కోరారు.
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని యువకుడి మృతి
రాజుపాళెం : మండలంలోని అయ్యవారిపల్లె–టంగుటూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వంగల నూర్ బాషా (25) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సు టంగుటూరు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొనడంతో యువకుడు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన నూర్‌బాషాను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు.
గ్రామ పంచాయతీ విభజన యత్నాలపై ఆగ్రహం
కలసపాడు : మండలంలోని మహానందిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలకు తెలియకుండా, దండోరా వేయకుండా అధికారులు ఆదివారం గ్రామపంచాయతీ విభజనపై గ్రామసభ నిర్వహించారు. ఉం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా దండోరా వేయకుండా సెలవుదినమైనప్పటికీ పంచాయతీ విభజన ఎలా చేస్తారని ప్రజలు మండిపడుతున్నారు.
కురబలకోటలో విషాదం
తండ్రి కోసం.. కుమారుడి మృతదేహం ఎదురుచూపు


