మాజీ సర్పంచ్‌పై దాడి
మదనపల్లె రూరల్ : వైఎస్సార్‌సీపీ నాయకుడు, కోటవారిపల్లె మాజీ సర్పంచ్ సొక్కం రాజశేఖర్‌పై ఆదివారం కొందరు యువకులు దాడి చేశారు. సొక్కం రాజశేఖర్, కొత్తపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి మదనపల్లెకు కారులో వెళుతుండగా ఈశ్వరమ్మకాలనీ వద్ద గొడవ జరిగింది. మదనపల్లె–రామసముద్రం మార్గంలో ఈశ్వరమ్మకాలనీ వద్ద రహదారి పనులు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకలన్నీ సింగిల్ వేలో సాగుతున్నాయి. ఈ క్రమంలో సొక్కం రాజశేఖర్ వెళుతున్న కారు, ఈశ్వరమ్మకాలనీకి చెందిన యువకులు వెళుతున్న కారు ఎదురెదురు పడ్డాయి. రోడ్డు నుంచి పక్కకు ఎవరు తొలగాలనే విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ సర్పంచ్ కారు రోడ్డు దిగాలంటూ యువకులు హంగామా చేయడంతో, ఆయన కారు నుంచి కిందకు దిగి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో వారు మూకుమ్మడిగా ఆయనపై దాడిచేశారు. జరిగిన ఘటనపై మాజీ సర్పంచ్ సొక్కం రాజశేఖర్, తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ చంద్రమోహన్‌కు ఫిర్యాదు చేశారు.
కడపలో అగ్నిమాపక శాఖ క్రీడలు
కడప అర్బన్ : కడప నగరంలో అగ్నిమాపకశాఖ అధికారుల పర్యవేక్షణలో ఆదివారం క్రీడలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈనెల 30న గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు. అక్కడ ఎంపికై న వారిని రాజస్థాన్‌లో జరిగే నేషనల్ ఫైర్ సర్వీస్ గేమ్స్‌కు పంపనున్నారు.


