విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు
పీలేరు రూరల్ : విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన నాగమ్మ కుమారుడు గోవిందుల చరణ్‌సాయి (14) స్థానిక శ్రీ భువన విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అదృశ్యమయ్యాడు. విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆచూకి తెలిస్తే 9440796744, 9440796745 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎమ్మెల్యేను విమర్శించే నైతికత చమర్తికి లేదు
రాజంపేట : రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డిని విమర్శించే నైతికహక్కు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజుకు లేదని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండుగోపి హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కువైట్‌లో అక్రమంగా నాటుసారా తయారుచేసి, అమ్ముకున్న సంగతి రాజంపేటలోని అందరికి తెలిసిందేనన్నారు. చెరువులు, పొరంబోకులు కబ్జా చేసి లేఔట్లు వేశాడన్నారు. రాజంపేటకు భూకబ్జాలను పరిచయం చేసేంది గంపశివనే అన్నారు. జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి గొంటు మణి మాట్లాడుతూ రాజంపేట మండలంలో మిట్టమీదపల్లె, ఊటుకూరు, ఆకేపాడు గ్రామాలను విడదీయాలని ప్రయత్నించిన కుట్రదారుడు చమర్తి అని దుయ్యబట్టారు. సమావేశంలో దళిత నేతలు దాసరి పెంచలయ్య, రంగాల కమలాకర్, బొజ్జా పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
బాలనర్తకి కేతనరెడ్డికి అవార్డు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్) : కూచిపూడి నృత్యంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మద్దిరాల కేతనరెడ్డికి ‘నవ తెలుగు తేజం – శ్రీ లలిత శ్రావంతి అవార్డు దక్కింది. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మద్దిరాల కేతనరెడ్డి కూచిపూడి ప్రదర్శనలో అబ్బురపరుస్తోంది. కేతన ఇప్పటికే భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రపంచంలో సత్తా చాటింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకోవడం తన భవిష్యత్ లక్ష్యమని కేతనరెడ్డి తెలిపింది.
విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు
విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు


