సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదనపల్లెకు రాక
మదనపల్లె రూరల్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వి.ఎన్ భట్టి శనివారం రాత్రి మదనపల్లెకు విచ్చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన మదనపల్లెలోని సొసైటీ కాలనీలో ఉన్న స్వగృహానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రెండో అదనపు జిల్లా జడ్జి పీవీఎస్‌ఎన్ సూర్యనారాయణమూర్తి, జూనియర్ సివిల్ జడ్జి సుబహాన్, డీఎస్పీ మహేంద్ర, తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి భట్టి 28వ తేదీ చిత్తూరు జిల్లా చౌడేపల్లి లోని మృత్యుంజయ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. 29వ తేదీ సోమవారం మదనపల్లె నుంచి బయలుదేరి, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెళతారు అనంతరం 30వ తేదీ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తారని అధికారక షెడ్యూల్ ప్రొగ్రాంలో పేర్కొన్నారు.


