రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
సిద్దవటం : ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. సిద్దవటంలోని 30 పడకల ప్రభుత్వ వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులకు ఎక్కువ శాతం పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రజలే వస్తుంటారన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి గర్భిణీ వైద్యశాలలోనే కాన్పు అయ్యేటట్లు చూడాలన్నారు. గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు రూ.40 వేలు విలువ చేసే ఇంజక్షన్ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు గోపాలస్వామి, కుప్పం సుబ్బారెడ్డి, వైద్యాధికారులు డాక్టర్ చిరంజీవిరెడ్డి, డాక్టర్ ప్రకాష్, వరప్రసాద్, జ్యోత్స్న, శివాని, మురళి, తేజ వినయ్, జడ్పీటీసీ ఉపాసి శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, యూత్ కన్వీనర్ కృష్ణచైతన్య, రాజంపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కేవీ సుబ్బయ్య, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ నూర్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి


