దరఖాస్తుల ఆహ్వానం
పెనగలూరు: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీషు సబ్జెక్టు గెస్ట్ ఫ్యాకల్టీ కోం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు దరఖాస్తును ఈనెల 28వ తేదీలోగా స్వయంగా ప్రిన్సిపాల్ చేతికి అందజేయాలన్నారు. 29వ తేదీ నుంచి డెమో క్లాసులు కళాశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ అమ్మవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారిని ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు,పూలు, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. మహిళలు నిమ్మకాయలపై ఒత్తులు వెలిగించి హారతులు పట్టారు. అమ్మా..కరుణించమ్మా అని వేడుకున్నారు. ఈవో డివి రమణారెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
రాయచోటి: జిల్లా కలెక్టర్ యూనిట్ రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కలెక్టరేట్ ఏఓ నాగభూషణం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఏపీఆర్‌ఎస్‌ఏ కలెక్టరేట్ యూనిట్ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2025–28 కాలానికి ఎన్నికై న కమిటీ పని చేయనుంది. ప్రెసిడెంట్ గా నాగభూషణం (ఏఓ), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శ్రావణి (ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్),, సెక్రటరీగా పి వంశీకృష్ణ (సీనియర్ అసిస్టెంట్), ఇతర పదవులకు సంబంధించిన అధికారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఫణికృష్ణ, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి నరసింహ కుమార్‌లు ఎన్నికల అధికారులుగా కొనసాగారు.
కడప సిటీ: వైఎస్సార్; అన్నమయ్య జిల్లాలోని మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతు కుటుంబాలు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి భక్తవత్సలరెడ్డి తెలిపారు. ప్రొఫెఫనల్ కోర్సుల్లో అంటే ఇంజినీరింగ్, మెడిసిన్, డెంటల్, వెటర్నరీ, అగ్రికల్చర్, బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వాటిలో 2025–26 అకడమిక్ ఇయర్‌లో అడ్మిషన్ పొందిన మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువుల పిల్లలు ప్రధానమంత్రి ఉపకార వేతనానికి అర్హులని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేఎస్‌బీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు కడపలోని సైనిక సంక్షేమ కార్యాలయం 86882 17828 నెంబరులో సంప్రదించాలన్నారు.
పీలేరు రూరల్: నూతనంగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిన పీలేరులో ఆర్డీవో కార్యాలయానికి అవసరమైన భవనం కోసం పలు చోట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. మదనపల్లె మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలికల వసతిగృహం, జెడ్పీ బంగా వద్ద ఉన్న గ్రామ సచివాలయం భవనం, మూతపడిన పాలశీతలీకరణ కేంద్ర భవనాలను పరిశీలించారు. రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రమేష్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, తహశీల్దార్ శివకుమార్, ఎంపీడీవో శివశంకర్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
దరఖాస్తుల ఆహ్వానం


