అధికారుల్లో గుబులు
ఒక జిల్లా అధికారి నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టడంతో ఇప్పుడు అధికార యంత్రాంగంలో గుబులు పుట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో, ప్రోటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనలను పాటించకుంటే ఇలాంటి పరిస్థితి తమకు కలగవచ్చన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కిందిస్థాయి అధికారుల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అన్న నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు కూడా చేపట్టారు. చివరకు ప్రజా ప్రతినిధుల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటంపై చర్యలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులు నిబంధనలను, ప్రతినిధుల హక్కులను గౌరవించేలా పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది.


