చేయి నరుక్కున్న చేనేత కార్మికుడు
మదనపల్లె రూరల్: రుణ దాతల వేధింపులు భరించలేక చేనేత కార్మికుడు చేయి నరుక్కున్న సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న వెంకటరమణ కుమారుడు నాగార్జున కుమార్(38) అ వివాహితుడు. స్థానికంగా చేనేత పనులు చేస్తూ జీ విస్తున్నాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద రూ.2 లక్షలు అప్పు చేశాడు. వారికి నూటికి రూ.5 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నాడు.కొంతకాలంగా రు ణదాతల నుంచి అప్పు చెల్లించాలని ఒత్తిడి అధికమైంది. దీంతో మానసిక క్షోభకు గురై ఇంట్లోనే కొడవలితో తనకు తానుగా చేతిని నరుక్కున్నాడు.కుటుంబసభ్యు లు అతన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.


