రైతుపై హత్యాయత్నం
బి.కొత్తకోట : ఇంటిస్థల వివాదం ఓ రైతుపై హత్యాయత్నానికి దారితీసిన ఘటన గురువారం తెల్లవారుజామున మండలంలోని కంబాలపల్లెలో జరిగింది. దీనిపై సీఐ గోపాల్‌రెడ్డి మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా.. బీరంగి గ్రామం కంబాలపల్లెకు చెందిన శంకర (45), చౌరెడ్డి (40) మధ్య ఇంటిస్థలం విషయమై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహరంపై శంకర కోర్టును అశ్రయించడంతో చంపుతానని చౌరెడ్డి బెదిరింపులకు పాల్బడుతున్నాడు. వివాద స్థలంలో చౌరెడ్డి చెత్తకుప్పలు వేస్తుండటంతో వాటిని తీసివేయాలని శంకర కుటుంబీకులు చెప్పగా వారిపైనే గొడవలకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున శంకరను చౌరెడ్డి అసభ్యంగా దూషిస్తూ, తిడుతూ చంపాలనే ఉద్దేశంతో కొడవలితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో శంకర తలపై, ఎడమ చేతిపై నరకడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు లలిత, రెడ్డెప్ప, నారాయణస్వామిలు చౌరెడ్డి దాడి నుంచి శంకరను కాపాడారు. గాయపడిన బాధితుడిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య అశ్విని ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప రైల్వేస్టేషన్ సమీపంలోని బుగ్గవంక బ్రిడ్జి వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని గుర్తించిన వారు కడప రైల్వే సీఐ 94406 27398, ఎస్‌ఐ 94409 00811 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ గల్ఫ్, కువైట్
కమిటీల సేవలు ప్రశంసనీయం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ గల్ఫ్, కువైట్ కమిటీల సేవలు ప్రశంసనీయమని ఆ పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు అన్నారు. మూడోసారి గల్ఫ్ కన్వీనర్‌గా ఎన్నికై గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, దుబాయ్‌లలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దిగ్విజయంగా నిర్వహించి కడపకు విచ్చేసిన బీహెచ్ ఇలియాస్‌ను వారు ఘనంగా సన్మానించి అభినందించారు.
ఇంటిస్థల వివాదమే కారణం


