
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతుందన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
రాజంపేట టౌన్: హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు నిర్వహించే ప్రథమ, మధ్యమ, ఉత్తమ, విశారత్, భూషణ్, విద్వాన్ పరీక్షలకు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రేమ్‌చంద్ హిందీ భవన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సర్తాజ్ హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోతరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులన్నారు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో పరీక్షలు ఉంటాయన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు హిందీపండింట్ ట్రైనింగ్ చేసేందుకు, డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారన్నారు. మరిన్ని వివరాలకు 6303701314 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 18వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని పేర్కొన్నారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తుల అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. మరికొందరు తలనీలాలు సమర్పించారు. హిందువులతోపాటు ముస్లీమ్‌లు ఫూజలు నిర్వహించారు. కర్ణాటకా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో సోమవారం మొదటి సంవత్సరం నూతన బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చాన్స్‌లర్ నాదెళ్ల విజయ భాస్కర్ చౌదరి తెలిపారు. ఇందుకు రియా అనే హ్యుమనాయిడ్ రోబో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. బెంగళూరు నుండి తీసుకొచ్చారు. రోబో గురించి వినడం చదవడం ఆపై సినిమాల్లో చూడటం తప్ప ఈ ప్రాంత వాసులు ప్రత్యక్షంగా చూడడం ఇదే తొలిసారి. విద్యార్థులకు స్వాగతం పలకడంతో పాటు ముఖా ముఖి నిర్వహించనుంది. అతిథిగా అలరించనుంది. విద్యార్థులతో ఇది ప్రత్యక్ష ఇంటరాక్ట్ చేయనుంది. మిట్స్ క్యాంపస్‌లో నూతన ఉత్సాహాన్ని ఇనుమడింపజేయనుంది. 19న ప్రేరణాత్మక వక్తి యండమూరి వీరేంద్రనాధ్ హాజరవుతున్నట్లు తెలిపారు.

మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు