
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం పో
ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి
ఒంటిమిట్ట: భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం కోసం పోరాడాలని ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన స్వగృహంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..5 రోజుల క్రితం ఒంటిమిట్ట మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో నన్ను గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరూ, భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇంత కంటే దీటుగా పోరాడి వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలన్నారు. ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్‌రాజు, పచ్చ ముసుగు వేసుకుని విధులు నిర్వహించిన అధికార యంత్రాంగం అందరూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగారన్నారు. నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. మొదటి సారిగా ఒంటిమిట్ట మండలంలో హింసాత్మక వాతావరణం నెలకొన్న ఎన్నికలను మండల ప్రజలు చూశారన్నారు. ఈ హింసాత్మక ఎన్నికలతో ప్రజల్లో వైఎస్సార్‌సీపీపై సానుభూతి పెరిగి, వచ్చే ఏ ఎన్నికల్లోనైనా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కూండ్ల ఓబుల్ రెడ్డి, దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, మేరువ శివనారాయణ, శేఖర్ రెడ్డి, రాజమోహన్ నాయుడు, రాజశేఖర్‌రాయల్, గురుమోహన్ రాజు, మనోహర్ రెడ్డి, వెంకట కృష్ణ రెడ్డి, గంగిరెడ్డి, రవిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, పాండురంగారెడ్డి, అబ్బిరెడ్డి, జాకీర్ హుసేన్, శేషారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.