
వైఎస్ జగన్ పర్యటన ఖరారు!
రాజంపేట: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు రానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయిందని రాజంపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి ఆదివారం విలేకర్లకు తెలిపారు.రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆకేపాటి సాయిఅనురాగ్‌రెడ్డి, వరదీక్షితా నవదంపతుల రిసెప్షన్‌కు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేసి, నవదంపతులను ఆయన ఆశీర్వదించనున్నారన్నారు. ఆకేపాటి ఎస్టేట్‌లో రిసెప్షన్ వేడుక జరగుతుందని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి రాజంపేటకు హెలీక్యాప్టర్‌లో వస్తారన్నారు. ఇందుకోస హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఉదయం పది గంటలకు బయలుదేరుతారన్నారు. తిరిగి ఆకేపాడు ఎస్టేట్ నుంచి 12.35 గంటలకు బయలుదేరి బెంగళూరుకు వెళతారన్నారు. వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్న తరుణంలో భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని,, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆకేపాటి అనిల్‌రెడ్డి తెలిపారు.
పర్యటన వివరాలు..
ఉదయం 10గంటలకు బెంగళూరులోని యలహంక నుంచి బయలుదేరుతారు. రోడ్డుమార్గంలో 10.20కి చేరుకుంటారు, 10.30గంటలకు జక్కురు ఎయిర్‌డ్రోమ్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు. 11.30గంటలకు ఆకేపాడులోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో 11.40గంటలకు ఆకేపాటి ఎస్టేట్‌కు చేరుకుంటారు. 12 గంటల నుంచి 12.15 వరకు ఆకేపాటి ఎస్టేట్‌లో ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి తనయుడు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొంటారు. 12.25కు హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 12.35కు జక్కూరు ఎయిర్‌డ్రోమ్ బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.40 గంటలకు బయలుదేరి 2గంటలకు యలహంకలోని రెసిడెన్సీకి చేరుకుంటారు.
19న ఆకేపాడుకు రాక
షెడ్యూల్ వివరాలు వెల్లడి