యోగాతో ఆరోగ్యానికి రక్ష
నందలూరు : నిత్యం యోగా సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన సౌమ్యనాథస్వామి ఆలయం ఆవరణలో శనివారం కలెక్టర్ ఆధ్వర్యంలో వేయి మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరి ఆరోగ్య ఆంధ్ర సాధ్యమవుతుందన్నారు. రాజంపేట హైదర్‌నగర్‌కు చెందిన న్యాయశాస్త్రం రెండో సంవత్సరం విద్యార్థిని ఆర్‌ఏఈ మహిద్య వేసిన యోగాసనాలు అందరినీ అబ్బురపరిచాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, డీఎఫ్‌ఓ జగన్నాఽథ్‌సింగ్, సబ్ డీఎఫ్‌ఓ సుబ్బరాజు, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, డ్వామా పీడీ వెంకటరత్నం, జిల్లా ఎకై ్సజ్ అధికారి మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్‌ఈలు దయాకర్‌రెడ్డి, సహదేవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, డీఎంహెచ్‌ఓ ఉషశ్రీ, డీఎస్డీఓ గౌస్‌బాషా, పశుసంవర్థక శాఖ అధికారి, మండల స్పెషల్ అధికారి గుణశేఖర్‌పిళ్‌లై, తహసీల్దార్ పుల్లారెడ్డి, ఈఓపీఆర్‌డీ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీ తనిఖీ
రాజంపేట : రాజంపేట మండలం తాళ్లపాకలో పింఛన్ల పంపిణీ తీరుతెన్నులను జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ శనివారం తనిఖీ చేశారు. లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. నేరుగా ఇంటి వద్దకే వెళ్లి ఫించన్ అందజేస్తున్నారా అని లబ్ధిదారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పంపిణీ సందర్భంగా ఎవరైనా డబ్బు అడుగుతున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పీరుమున్నీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
7న అన్నమయ్య ఉద్యాన వనంలో యోగా
ఈనెల 7న అన్నమయ్య ఉద్యానవనం(అన్నమయ్య 108 అడుగుల విగ్రహం)లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అన్నమయ్య సంకీర్తనలు పాడే వారిని కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పీర్‌మున్నీ, ఎంపీడీఓ వరప్రసాద్ ఉన్నారు.
యోగాతో ఆరోగ్యానికి రక్ష


