
రిమ్స్‌లో ఫార్మసిస్ట్‌పోస్టు భర్తీకి పైరవీలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (రిమ్స్)లో రెగ్యులర్ ఫార్మసిస్ట్– గ్రేడ్ –2ను, ఫార్మసిస్ట్ కాంట్రాక్ట్ పోస్టులో నియమించమని యూనియన్ నాయకులు ఒత్తిడి తెస్తున్నారనీ అరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకోసం యూనియన్ నాయకులు రూ. 5– 8 లక్షల వరకు వసూలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెగ్యులర్ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ పోస్టులో ఉద్యోగిని నియమిస్తే జీతాలు సమస్య ఎదురవుతుందని తర్వాత భవిష్యత్తులో కాంట్రాక్టు ఉద్యోగి జాయిన్ అయితే రెగ్యులర్ ఉద్యోగస్తుని బయటికి వెళ్లాల్సి వస్తుంది. నిబంధన ప్రకారం కాంట్రాక్టు ఫార్మసీ పోస్టులో రెగ్యులర్ ఉద్యోగులకు పోస్టింగ్ లేదా బదిలీ ఇచ్చుట నిబంధనలకు విరుద్ధమని రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ వివరణతో యూనియన్ నాయకులు సంతృప్తి చెందలేదు. పైరవీలకు అలవాటు పడిన అధికార పార్టీ పేరుతో చలామణి అవుతున్న కొందరు యూనియన్ నాయకులు రిమ్స్ సిబ్బందిని చివరికి బెదిరింపు ధోరణికి పాల్పడిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈసంఘటన వివరాల్లోకెళితే ..ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్‌ఐడిసీ)సెంట్రల్ ట్రక్ స్టోర్‌లో వి.ఎన్‌పల్లి నుంచి డిప్యుటేషన్ లో ప్రస్తుతం ఓ రెగ్యులర్ ఉద్యోగి విధులను నిర్వహిస్తున్నారు.అతను తన మాతృశాఖకు వెళ్లుటకు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన ఉద్యోగి జిల్లా లోని ఏ పిహెచ్‌సీ లో పోస్టు ఖాళీగా ఉన్న కూడా పల్లెల్లో పోయి డ్యూటీ చేయుటకు ఇష్టం లేక రిమ్స్ జనరల్ హాస్పిటల్‌కు బదిలీ కావాలని ప్రయత్నించారు. యూనియన్ వారితో ఒక రేటు మాట్లాడుకుని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. యూనియన్ నాయకులలో కొందరు సొంత లాభం ఆలోచించి రిమ్స్ సూపరింటెండెంట్ సంప్రదించారు. కాంట్రాక్ట్ పోస్ట్‌లో రెగ్యులర్ ఉద్యోగిని నియమించడం లేదా బదిలీ చేయడం డిపార్ట్‌మెంట్ నియమ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. సదరు యూనియన్ లీడర్స్ సిబ్బందిని బెదిరించి జీతాలు విషయంలో మిగతా ఏ సమస్యలనైనా డీఎంఈ కార్యాలయం లో తమకు సహకరించు అధికారులు ఉన్నారు. డీఎంఈ ఇంకా పైస్థాయిలో మేం చూసుకుంటాము మీరు క్లారిఫికేషన్ రాయండి అని ఒత్తిడి చేశారు. అయినా రిమ్స్ సూపరింటెండెంట్ మొత్తం రిమ్స్ లో ఫార్మసిస్టులు పోస్టులు 11. రెగ్యులర్ ఉద్యోగులు 11 మంది పనిచేస్తున్నారని, 10 కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ పోస్టులకు 9 మంది పని చేస్తున్నారని ఇటీవల ఒక కాంట్రాక్టు ఉద్యోగి రిజైన్ చేయడం వల్ల ఒక ఖాళీ ఏర్పడిందిదని, ఆ పోస్టు కాంట్రాక్ట్ పోస్ట్ మాత్రమే అని క్లారిఫికేషన్ ఆర్డీకి లెటర్ పెట్టారు. ఈ విధానానికి యూనియన్ నాయకులు సంతృప్తి చెందలేదు. కోర్టును ఆశ్రయిస్తామని రిమ్స్‌లో అధికారులను, సిబ్బందిని బెదరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యూనియన్ నాయకులు తమ స్వార్థాలకు సమూహంగా ఏర్పడి చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అధికారులు వీరి బెదిరింపులకు లొంగవద్దని పలువురు ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఈ సంఘటనలో జీజీహెచ్‌లోని ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ యూనియన్ నాయకుల బెదరింపులకు బెంబేలెత్తి పోయింది. మరోవైపు జీజీహెచ్(రిమ్స్)లో ఫార్మసీ విభాగంలోనే పనిచేస్తున్న రెగ్యులర్ మహిళా ఉద్యోగి ఈనెలలోనే రిటైర్డ్ కాబోతుందని సమాచారం. ఆమె స్థానంలో కూడా సదరు ‘ఫార్మసీ ఆఫీసర్’ను నియమించేందుకు కూటమి అధికారపార్టీకి సన్నిహితంగా వుంటున్న పై యూనియన్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కాంట్రాక్ట్ పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి భర్తీకి యూనియన్ నాయకులు
అధికారులపై ఒత్తిడి
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్న
పాలనా విభాగా సిబ్బందికి బెదిరింపులు
ఇందుకోసం ‘పరిపాలనా విభాగం’లో కొందరి సహకారం?