రాజంపేట : వైఎస్సార్‌సీపీ యువజన విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ (జోన్–4)గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తనయుడు భూమన అభినయ్‌రెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అభినయ్‌రెడ్డి తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ఈయన జోన్–4 పరిధిలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం తరపున వైఎస్సార్‌సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.