
డిమాండ్ ఉండే సమయానికి కాయలు రాలేదు
మామిడి కాయలకు మంచి డిమాండ్ ఉంది. అయినా కాపు లేదు. ఈ ఎడాది దిగుబడి చాలా తక్కువగా ఉండటంతో చివరి వరకు కాయలను కోయకుండా అలాగే ఉంచారు. వారం రోజుల క్రితం వీచిన గాలివానకు కాయలు కూ డా రాలిపోవడంతో పాటు సీజన్ చివరికి చేరడంతో కాస్త డిమాండ్ పెరిగింది. బేనీషాలు టన్ను రూ.45 వేల నుంచి రూ.50 వరకు ధరలు పలుకుతున్నాయి. కానీ తోటల్లో కాయలు కనిపించడం లేదు. మొదటిలో కాయలు కోసినా డిమాండ్ లేకపోయింది. ఇప్పుడేమో ధరలు వచ్చేనాటికి కాయలు రావడం లేదు. గతేడాది కాయలు కాసినా లాభాలు రాలేదు...ఈ ఏడాది కాయలు లేకపోయినా ఎగుమతులు లేక ధరలు పలకలేదు. – మదనపల్లె సతీష్ బాబు,
మామిడి రైతు, వీరబల్లి మండలం