
మాట్లాడుతున్న కలెక్టర్ గిరీషా పీఎస్
రాయచోటి: జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ గిరీషా పీఎస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌మీనాకు వివరించారు. గురువారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటర్ల జనాభా నిష్పత్తి, లింగ నివృత్తి , ఓటర్ల నమోదు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు రాయచోటి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి ఫారం–6 పెండింగ్ 25 శాతం, ఫారం–7 పెండింగ్ 15 శాతం, ఫారం–8 పెండింగ్ 10 శాతం ఉందన్నారు. పెండింగ్ దరఖాస్తులను ఎలక్టోరల్ అధికారులు, తహసీల్దార్లకు తగు ఆదేశాలు జారీ చేశమన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యర్థనలు, తొలగింపులు, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ జరుగుతోందన్నారు. రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీఓ రంగస్వామి, కలెక్టరేట్ ఎస్‌డీసీ శ్రీలేఖ, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రక్తహీనత నివారణకు చర్యలు
మహిళలు, చిన్నపిల్లలలో అనిమీయా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ గిరీషా పీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వివిధ అంశాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన సమీక్ష కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొండయ్య, డీఈఓ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ గిరీషా పీఎస్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో రక్తహీనతలోపం ఉన్న గర్భిణీ సీ్త్రల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి సరియైన పోషకాహారం అందించి రక్తహీనత నివారణకు కృషి చేయాలన్నారు. అన్నమయ్య జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ పరిధిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే వందశాతం పూర్తి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్