గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న అధికారులు
రాయచోటి: గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయమని జిల్లా పర్యాటకశాఖ అధికారి నాగభూషణం అన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో గురువారం గుర్రంజాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అధికారులు గుర్రం జాషువా ఫొటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ గుర్రం జాషువా గబ్బిలం వంటి తన రచనలు ద్వారా అణగారిన వర్గాలకు ఎన్నో సేవలందించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుడు సహదేవ రెడ్డి, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి నాగరాజ, హౌసింగ్ పీడీ సాంబశివయ్య, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అబ్సోలం, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.


