మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు..! | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 8:56 AM | Updated on Feb 25 2023 3:25 PM

- - Sakshi

మదనపల్లె : మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రి వర్గాలతో శుక్రవారం ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన వెంకటేష్‌ భార్య లోకేశ్వరి మూడు నెలల కిందట జిల్లా ఆస్పత్రిలో మొదటి కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఐదు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం ఒక్కసారిగా ఊపిరాడకపోగా పరిస్థితి విషమంగా మారడంతో ఇంజెక్షన్‌ చేశారు. అయినా ఎలాంటి మార్పు రాకపోగా, మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. ఇక్కడి వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలతో బాధి తులు ఘర్షణకు దిగారు. చికిత్సలో తమ తప్పు లేదని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో.. చేసేదిలేక విషణ్ణవదనంతో బిడ్డను తీసుకుని ఇంటికెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement