‘రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు’ | YSRCP Support To Rayalaseema Garjana Minister Buggana | Sakshi
Sakshi News home page

‘రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు’

Dec 3 2022 8:08 PM | Updated on Dec 3 2022 8:40 PM

YSRCP Support To Rayalaseema Garjana Minister Buggana - Sakshi

కర్నూలు: రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. రాయలసీమ హక్కుల కోసం జేఏసీ పోరాటం చేస్తోందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్‌ చేస్తోందన్నారు. డిసెంబర్‌ 5వ తేదీన కర్నూలులో జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నారని, రాయలసీమ గర్జన పేరుతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  

రాయలసీమ గర్జన సభకు తమ పార్టీ వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బుగ్గన పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని ప్రాంతాల వారిని మోసం చేశారని,  పచ్చటి పొలాలను కూడా నాశనం చేశారని బుగ్గన మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు మంత్రి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement