నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan To Visit Tirumala Today, More Details Inside | Sakshi
Sakshi News home page

YS Jagan Tirumala Visit: నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌

Sep 27 2024 4:09 AM | Updated on Sep 27 2024 10:37 AM

YSRCP President YS Jagan to Visit Tirumala Temple

రేపు శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోను­న్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్‌ జగన్‌ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు.  

అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని, అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు, అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు.  

Advertisement
 
Advertisement
Advertisement