రేపు ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan To Prakasam Podili June 11th | Sakshi
Sakshi News home page

రేపు ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్‌ జగన్‌

Jun 10 2025 1:35 PM | Updated on Jun 10 2025 3:13 PM

YSRCP President YS Jagan To Prakasam Podili June 11th

తాడేపల్లి: పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రేపు(బుధవారం, జూన్‌11వ తేదీ) ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు బయల్దేరివెళ్లనున్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు వైఎస్‌ జగన్‌. 

గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్‌ జగన్‌ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడింది. దాంతో ఈనెల 11వ తేదీకి వైఎస్‌ జగన్‌ పర్యటన మారింది. రేపు  ఉదయం 10 గంటల ప్రాంతంలో పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. దీనిలోభాగంగా వైఎస్‌ జగన్‌ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పించనున్నారు,. 

రేపు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన

 

 

Advertisement
 
Advertisement
Advertisement