‘చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు.. పవన్‌కు నైతిక విలువలు లేవు’ | YSRCP Ministers And Leaders Serious On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Oct 19 2022 1:05 PM | Updated on Oct 19 2022 1:18 PM

YSRCP Ministers And Leaders Serious On Pawan Kalyan - Sakshi

సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నేతలు ఫైరవుతున్నారు. 

► నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి 
పవన్‌ కల్యాణ్‌ తండ్రి పరువు తీశాడు. చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్‌ మాట్లాడాడు. రాజకీయాలకు పవన్‌ కల్యాణ్‌ పనికిరాడు.

► మల్లాది విష్ణు..
పవన్‌కు సిద్ధాంతం, నైతిక విలువలు లేవు. ప్రజాప్రతినిధులను దుర్బాషలాడటం సరికాదు. చంద్రబాబు చేతిలో పవన్‌ కీలుబొమ్మ. 

► కిలారి రోశయ్య.. 
పవన్‌ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. కాపులకు పవన్‌ చేసింది శూన్యం. దిశ, దశ లేని పార్టీగా జనసేన మిగిలిపోతుంది. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి పవన్‌. 

► అంబటి రాంబాబు.. 
జనసైనికులా? బాబు బానిసలా. యుద్ధానికి సిద్ధం అన్నావ్‌.. చంద్రబాబు సంకెక్కావ్‌. పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement