సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలోని పోతులపాడు టర్నింగ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోతిరెడ్డిపాడుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు మాజీ మంత్రి శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా, సుధీర్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ..‘సీమకు నీళ్ళు కావాలని పోతిరెడ్డిపాడు చూడటానికి వెళ్తే అడ్డుకోవడం ఏంటి?. ఇది చాలా దారుణం. ఖచ్చితంగా వెళ్లి తీరుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్‌సీపీ నేతలు వస్తున్నారనే కారణంగా అధికారులు.. పోతిరెడ్డిపాడు గేటుకు తాళం వేయడం గమనార్హం. అంతేకాకుండా రెగ్యులేటర్ వద్దకు వెళ్ళడానికి అనుమతులు లేవన్న సాకుతో పోతిరెడ్డిపాడు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు.


