
సైకో కాబట్టే ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు...
బాలకృష్ణపై వైఎస్సార్‌సీపీ నేతల ఫైర్
సాక్షి అమరావతి: ‘నందమూరి బాలకృష్ణా... నువ్వే సైకోవు.. కాబట్టే ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు. నువ్వు సైకోవు కాబట్టే నీకు మెంటల్ సర్టీఫికెట్ ఇచ్చారు. మెంటల్ సర్టీఫికెట్ తెచ్చుకుని బయట తిరుగుతున్నావు.’ అని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
అదీ జగన్‌కు.. బాలకృష్ణకు తేడా
అఖండ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అప్పటి నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆ సినిమా నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డి ద్వారా బాలకృష్ణ నాకు ఫోన్ చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కలుస్తానని, సమయం ఇప్పించాలని కోరారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్‌కు చెబితే బాలకృష్ణ నన్ను కలిస్తే.. ఆయనకే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని.. బాలకృష్ణ ఏది అడిగితే అది చేయాలని నన్ను ఆదేశించారు. అదీ వైఎస్ జగన్ సంస్కారం. ఈ రోజు బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన సంస్కారహీనానికి నిదర్శనం. అప్పట్లో సినిమా పరిశ్రమ సమస్యలపై నాటి సీఎం వైఎస్ జగన్‌తో హీరో చిరంజీవి నేతృత్వంలో సినిమా పెద్దలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పాల్గొనని బాలకృష్ణ వంటివారు సినిమా పెద్దలను వైఎస్ జగన్ అవమానించినట్లు చిత్రీకరిస్తూ వస్తున్నారు. – పేర్ని నాని, మాజీ మంత్రి
బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో..
మాజీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచి్చనట్టు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సభలో బాలకృష్ణ వ్యవహారశైలి, బయట ఫ్యాన్స్‌తో ఆయన నడుచుకునే విధానం చూస్తే సైకో ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ మెంటల్ సర్టీఫికెట్‌తో బయట తిరుగుతున్నాడు. నువ్వు సైకోవు కాబట్టే నీకు మెంటల్ సర్టీఫికెట్ ఇచ్చారు. నువ్వు సైకోవు కాబట్టే ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు. – జూపూడి ప్రభాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయాలి
అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. బాలకృష్ణ నిండు సభలో జేబులో చేతులు పెట్టుకుని సభామర్యాదలు పాటించకుండా మాట్లాడుతూ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సభలో బాలకృష్ణ ఉపయోగించిన భాష అభ్యంతకరం. ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలేమో అనిపించేలా దిగజారి మాట్లాడారు. – మార్గాని భరత్, మాజీ ఎంపీ
ఆయన భాషలోనే బదులిస్తాం
ఓజీ సినిమా టికెట్‌ను రూ.వెయ్యికి పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారన్న కడుపుమంట బాలకృష్ణకు ఉంటే వెళ్లి చంద్రబాబుతో మాట్లాడుకోవాలి. పవన్‌కళ్యాణ్ మీద కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలి. సభలోలేని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడటం సిగ్గుచేటు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆయన వాడిన భాషలోనే మేమూ బదులిస్తాం. – తూమాటి మాధవరావు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ